పోస్ట్‌లు

ఎన్నికల్లో --- ఎన్ని కలలో

ఎన్నికల్లో -- ఎన్ని కలలో రారా భోజనానికి చల్లారిపోతుంది. అమ్మమ్మ కేక విని భోజనానికి లేచాడు అమృతం. ఇదేమిటి! ఇంటినిండా గ్లాసులు ఉన్నాయి కదా!కొత్తవి ఎందుకు కొన్నావు? ప్రశ్నించాడు అమృతం. నీ మొహం ఇవి కొన్నవి కాదు. మన వార్డు మొంబరుగా పోటీ చేస్తున్న కాశీపతిగారి గుర్తు గ్లాసుట. అందుకని ఇంటికో అరడజను గ్లాసులు పంచేరు. అదీ సంగతి. ఓహో! అనుకుంటూ కంచంలో చేయి పెట్టాడు. అదేమిటే!వంకాయలు తెచ్చి నాలుగు రోజులయింది. అదీ రేటు ఎక్కువగా ఉందని ఒక కేజీయే తెచ్చాను.నాలుగు రోజులుగా వదలకుండా అదే కూర ఎలా వండు తున్నావు? మీ తాతగారి దగ్గర చదువుకున్న అప్పలనాయుడు కూడా పోటీ చేస్తున్నాడు. అతడి గుర్తు వంకాయిట. ఇంటికి రెండు కేజీలు చొప్పున పంచేరు.qqqqQ3q3aqq వంకాయికి వరన్నానికి వి11సుపులేదని అదే వండుతున్నాను. అయిష్టంగా భోజనం ముగించి నిద్రకుపక్రమించాడు అమృతం. "అమృతరావు జిందాబాద్" "అమృతం జిందాబాద్" మీ అమూల్యమైన ఓటును సెల్ ఫోను గుర్తుపై వేసి మన ప్రియతమ నాయకుడు అమృతరావునే గెలిపించ ప్రార్థన. సోదర సోదరీ మణులారా!⁰ 

అమృతం -- వాషింగ్ పౌడరు

ఒరేయ్ అమృతం మార్కెట్టుకి వెళ్ళి కూరగాయలు తేవాలి , ఇంట్లో నిండుకున్నాయి.  బెండకాయలు  ఈ పూట చేశాను. రేపటికి తేవాలి.   అమ్మమ్మా! నాకు కుదరదు. రేపట్నుంచి నాకు ఆఫీసులో ఆడిట్ ఉంది. చిన్నాడిని తీసుకుని వెళ్లి నువ్వే తెచ్చుకో అని తన పనిలో తను ములిగి పోయాడు. చంటీ! పదరా మనం మార్కెట్టుకి వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం అని పిలిచి సంచి తీసుకుని బయలు దేరారు ఇద్దరూ.  కావలసిన సరుకులు కొనుక్కుని, కూరగాయల మార్కెట్టుకి వచ్చారు.  కూరగాయలు తీసుకుని అమ్మమ్మ డబ్బులు తీసి కొట్టువాడికి ఇచ్చింది.   డబ్బులు ఇచ్చేడప్పుడు పది రూపాయలు పడిపోవడం ఆమె గమనించలేదు కానీ చంటాడు గమనించి, బడ్డీ కిందకి దూరి కష్టపడి తీసి అమ్మమ్మకి ఇచ్చాడు. అరె చొక్కా అంతా మురికి అయిపోయింది. పోతే పోయింది వదిలేయకపోయావా? కసురుకుంది అమ్మమ్మ. ఫరవాలేదమ్మా  పది రూపాయల ఈ వాషింగు పౌడరుతో  ఉతికితే మరకలన్నీ పోతాయమ్మా అంటూ వాషింగు పౌడరు పేకెట్టు తీసి ఇచ్చాడు.   ఓరి నీ మొహంమ్మండ! పది రూపాయలతో పౌడరు కొని అది వేసి ఉతకడం వల్ల మరకలు పోతాయి కరక్టే. పది రూపాయలతో పాటు ఉతికే శ్రమ ఎవరికిస్తావు?  అదే పదిరూపాయలు తీయకుండా ఉంటే,  ఉతికే శ్రమ ఉండేది కాదు కదా .  ఇప్పుడు పది

అమృతం

ఒరేయ్ అమృతం ఏం చేస్తున్నావు? భోజనం టైము దాటిపోతోంది. కాళ్ళు చేతులు కడుక్కుని రా! ఆఁ వస్తున్నా. ఐదు నిమిషాల్లో వస్తున్నా. అమ్మమ్మా! ఏం చేశావు ఈరోజు? అంటూ చేతులు ముఖం తువ్వాలుతో తుడుచుకుంటూ వచ్చాడు అమృతం. పప్పూమామిడికాయ, వంకాయ కూర,ముక్కల పులుసు ఉన్నాయిరా అంటూ కంచం తుడిచి పెట్టింది అమ్మమ్మ. భోంచేసి చిన్నగా కునికాడు అమృతం. చిన్న మనవడు స్కూలు నుంచివచ్చేసరికి ఏదో ఒకటి తినడానికి ఉండాలి లేకపోతే చిరాకు పడతాడు అనుకుంటూ వంటింటి దారి పట్టింది అమ్మమ్మ. ఆఁ నూడిల్సు అంటే ఇష్టం వెధవకి అనుకుంటూ, నూడిల్సు తయారు చేసింది. వాడు వచ్చేసరికి నూడిల్సు, సాసు టేబులు మీద పెట్టింది. అమ్మమ్మా! నేను ఫ్రష్ అయి వచ్చేశా, ఏం చేశావు అని అంటూ డైనింగు టేబులు దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. అమృతం కూడా టీ టైము అయిందని తనూ కుర్చీలో కూర్చన్నాడు. అమ్మమ్మ ఇచ్చిన టీ తాగుతూ చంటాడి ప్లేటుకేసి చూశాడు. వాడు నూడిల్సు ప్లేటులో సాసు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాని అది పడటం లేదు. అమ్మమ్మా సాసు పడటం లేదు అని అరిచాడు చంటాడు. ఉండు వస్తున్నా అని ఒక డల్కోఫ్లెక్సు టాబ్లెట్ తెచ్చింది. అది ఎందుకు? ప్రశ్నించాడు అమృతం ఓరి వెర్రిమొహం ఎప్ప

గీత --- మానవప్రవర్తన

 బంధమునకు గాని మోక్షమునకు గాని మనస్సే కారణము. మనస్సు చంచలముగ ఉంటే బంధము నిశ్చలముగ ఉంటే మోక్షము లభిస్తాయి. బ్రహ్మజ్ఞాని విపత్కర అప్రియ సందర్భాలలో దుఖించడు. అలాగే ఎటువంటి సౌఖ్యప్రదములయందు ఉప్పొంగడు. ఈ ప్రపంచం స్వప్న తుల్యముగ భావిస్తారు.  వారు అన్ని జీవరాశులయందు సమ భావము కల్గి ఉంటారు.  (In the state of equilibrium) జ్ఞానికి అజ్ఞానికి గల బేధం వారి నడవడిలోనే తెలిసిపోతుంది.   నేత్రములు కలవారికి లేనివారికి నడకయందు ఎట్లు తేడా ఉండునో అట్లే జ్ఞానికి అజ్ఞానికి బేధము ఉంటుంది.  ఆత్మ నిలకడగ ఉండవలెనన్న బాహ్య విషయములనుండి మనస్సును మరల్చాలి.  ఆత్మ జ్ఞానము గలవారు సుఖ - దుఖ్ఖ ములయందు సమభావము కలిగియుందురు. సమదృష్టి వైరాగ్యానికి చివరి మెట్టు.  భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువుము మనసా అని అన్నమయ్య అన్నారు   కాలము నితనిరూపే కర్మము నితనిరూపే  యేలి యాచార్యుడు చెప్పినదితనిరూపే శ్రీలలనాపతి శ్రీవేంకటేశ్వరుడే పాలించగాగంటి నే నీపరమాత్ముని రూపే.

గీత -- మానవప్రవర్తన

 ఆత్మ స్వయం ప్రకాశమైనది.  అది జీవుని అజ్ఞానం చేత కప్పబడినదై, భావింపకూడనివానియందు లగ్నమై అన్నిటియందు తానే కర్తగ భావిస్తూ దుఖిస్తున్నది. ప్రకాశవంతమైన సూర్యుడు దట్టమైన మబ్బులచే కప్పబడినట్టుగా అంధకారములో ఉంటుంది. కానీ బలమైన గాలివీచి మబ్బులు తొలగి సూర్యుడు ఎట్లు ప్రకాశించునో అట్లే  జీవుడు కర్మ జ్ఞానము పొంది ఆత్మ ప్రకాశము బడయగలడు. దీపముపై కుండ బోర్లించిన జ్యోతి కనపడదు. కుండను బద్దలుకొడితే తేజోప్రకాశమైన జ్యోతి కనిపిస్తుంది.   Each soul is potently devine. ఆత్మ యందే బుద్ధికలవారై దానియందే మనస్సు లగ్నం చేసి, నిష్ఠతో తదేకపరాయణులై ప్రవర్తించాలి. కర్మ ఫలాన్ని ఆశించక, కర్మఫల సన్యాసులై ధర్మకార్యాచరణ, పరోపకార తత్పరులై భగవధ్యానమందు ఉన్నవారికి మోక్షము లభించుననుటలో సందేహము లేదు.               ఎంత కందినదో కరము కొండ మోసి              ఎంత నలిగినదో కరపద్మము బండిలాగి                కాపడము పెట్టెద కరమునందించు తండ్రీ                నీ అడుగుల కడ పడి ఉందు చిన్నికృష్ణా!  అని భగవధ్యానమునందు మనసును లగ్నము చేసి నట్లైన మోక్షము లభించగలదు.

గీత ----- మానవప్రవర్తన

 ఇంద్రియాలను స్వాధీవములో ఉంచుకున్న వారికి జీవితం ఆనందమయమై సాగుతుంది. ఇంద్రియ లోలులైన వారికి అశాంతి, దుఃఖము కలుగుతుంది. ఆత్మ కర్మలకు సాక్షీభూతమే  నని మెలగువారు ఆనందముగ ఉండగలుగుతారు.  జన్మాంతర సంస్కారాన్ని అనుసరించి జీవులు వాని వాని కర్మలు చేస్తూ వాటియొక్క ఫలితాలను అనుభవిస్తున్నాయి. ఏ విత్తు నాటితే అదే మొక్క వస్తుంది. అలాగే మనం ఏది వండుకుంటామో అదే తింటాము. కనుక ఉన్నతిని పొందు అవకాశమున్న ఈ జన్మని ఆత్మోద్ధరణ నిమిత్తం సద్వినియోగం చేయడం మన కర్తవ్యం. ఎన్నో జన్మల తర్వాత సంప్రాప్తించిన ఈ మానవ జన్మను పరమాత్మను తెలుసుకుని ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయుటకు ప్రయత్నంచేసి సఫలీకృతులు కావాలి. ప్రతి జీవి సచ్చితానందస్వరూపమగు ఆత్మయేగాని దృశ్య రూపమగు దేహము కాదు అను సత్యాన్ని గ్రహించిన జ్ఞాని మోక్షమును పొందగల్గుచున్నాడు.                 కట్టినారు కొందరు కొట్టినారు                పట్టినారు కొందరు పెట్టినారు                 అందరిని సమముగ చూసినావు                 నీ అడుగుల కడ పడి ఉందు చిన్నికృష్ణా! అని పరమాత్మ చెంత బుద్ధి నిలిపి ఉంచవలెను.

గీత ---- ప్రవర్తన

 ఆత్మ యనునది  దేహము, ఇంద్రియములు, మనస్సులకు అతీతమైనది. అది మనము చేయు కర్మలకు సాక్షగవుండి చిత్త ప్రవృత్తులను వీక్షిస్తుంటుంది. కాని ఏ కర్మకూ అది కర్త కాదు. అజ్ఞానము చేత జీవుడు తన స్వస్వరూపమును మరచి సర్వమూ తానేనని భ్రమసి కర్మ వికారాలను తనపై వేసుకుని దుఃఖమును పొందుతున్నాడు. తత్వజ్ఞానముచేత జ్ఞానము పొందిన వారు ఆత్మ యందు స్థిరబుద్ధితో మెలగి ఇంద్రియములు చేయు కర్మలకు కర్తగాక సాక్షిగ మాత్రమే మెలుగుతారు. ఇంద్రియములు వాని వానియందు చేయు కర్మలకు నేను సాక్షిని మాత్రమేనని పరమార్ధతత్వము తెలిసినవాడు తలుస్తాడు.          కలడు కలడనెడి వారిలో కలవు నీవు          లేడు లేడనెడి వారిలో నిజమునీవు          ఉండి లేనట్లు ఉంటివి ఉర్వినాధా           నీ అడుగుల పడి ఉందు చిన్నికృష్ణా  అని బుద్ధిని పరమాత్మయందు లగ్నముచేసి జీవుని మోక్షమార్గము నందు  నడిపించవలెను. ఎవరు తాము చేయు కర్మలను పరమాత్మకర్పించి,  ఆసక్తి  విడిచి చేస్తారో వారు తామరాకుపై నీటిబొట్టువలె పాపమును అంటబడక మోక్షమును పొందుదురు.  నిష్కామ కర్మాచరణవల్ల చిత్తశుద్ధి కలుగును. దీనివల్ల మనస్సు పరమ నిర్మలత్వాన్ని పొందుతుంది.  దీనివల్ల జ్ఞానము పొంది జీవన్ముక్తుడు అవుతాడు