గీత ----- మానవప్రవర్తన

 ఇంద్రియాలను స్వాధీవములో ఉంచుకున్న వారికి జీవితం ఆనందమయమై సాగుతుంది. ఇంద్రియ లోలులైన వారికి అశాంతి, దుఃఖము కలుగుతుంది. ఆత్మ కర్మలకు సాక్షీభూతమే  నని మెలగువారు ఆనందముగ ఉండగలుగుతారు. 

జన్మాంతర సంస్కారాన్ని అనుసరించి జీవులు వాని వాని కర్మలు చేస్తూ వాటియొక్క ఫలితాలను అనుభవిస్తున్నాయి. ఏ విత్తు నాటితే అదే మొక్క వస్తుంది. అలాగే మనం ఏది వండుకుంటామో అదే తింటాము. కనుక ఉన్నతిని పొందు అవకాశమున్న ఈ జన్మని ఆత్మోద్ధరణ నిమిత్తం సద్వినియోగం చేయడం మన కర్తవ్యం. ఎన్నో జన్మల తర్వాత సంప్రాప్తించిన ఈ మానవ జన్మను పరమాత్మను తెలుసుకుని ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయుటకు ప్రయత్నంచేసి సఫలీకృతులు కావాలి.

ప్రతి జీవి సచ్చితానందస్వరూపమగు ఆత్మయేగాని దృశ్య రూపమగు దేహము కాదు అను సత్యాన్ని గ్రహించిన జ్ఞాని మోక్షమును పొందగల్గుచున్నాడు. 

               కట్టినారు కొందరు కొట్టినారు

               పట్టినారు కొందరు పెట్టినారు 

               అందరిని సమముగ చూసినావు 

               నీ అడుగుల కడ పడి ఉందు చిన్నికృష్ణా!

అని పరమాత్మ చెంత బుద్ధి నిలిపి ఉంచవలెను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమృతం -- వాషింగ్ పౌడరు

అమృతం