గీత -- మానవప్రవర్తన

 ఆత్మ స్వయం ప్రకాశమైనది.  అది జీవుని అజ్ఞానం చేత కప్పబడినదై, భావింపకూడనివానియందు లగ్నమై అన్నిటియందు తానే కర్తగ భావిస్తూ దుఖిస్తున్నది. ప్రకాశవంతమైన సూర్యుడు దట్టమైన మబ్బులచే కప్పబడినట్టుగా అంధకారములో ఉంటుంది. కానీ బలమైన గాలివీచి మబ్బులు తొలగి సూర్యుడు ఎట్లు ప్రకాశించునో అట్లే  జీవుడు కర్మ జ్ఞానము పొంది ఆత్మ ప్రకాశము బడయగలడు. దీపముపై కుండ బోర్లించిన జ్యోతి కనపడదు. కుండను బద్దలుకొడితే తేజోప్రకాశమైన జ్యోతి కనిపిస్తుంది.  

Each soul is potently devine.

ఆత్మ యందే బుద్ధికలవారై దానియందే మనస్సు లగ్నం చేసి, నిష్ఠతో తదేకపరాయణులై ప్రవర్తించాలి. కర్మ ఫలాన్ని ఆశించక, కర్మఫల సన్యాసులై ధర్మకార్యాచరణ, పరోపకార తత్పరులై భగవధ్యానమందు ఉన్నవారికి మోక్షము లభించుననుటలో సందేహము లేదు. 

             ఎంత కందినదో కరము కొండ మోసి

             ఎంత నలిగినదో కరపద్మము బండిలాగి 

              కాపడము పెట్టెద కరమునందించు తండ్రీ 

              నీ అడుగుల కడ పడి ఉందు చిన్నికృష్ణా! 

అని భగవధ్యానమునందు మనసును లగ్నము చేసి నట్లైన మోక్షము లభించగలదు.

కామెంట్‌లు

  1. నిర్మలమైన మనస్సుతో సాధన చేసుకోవడమే. ఏదో పొందాలని మాత్రం కోరుకోకూడదు. కోరిక అనేది ఉపాసనకి అడ్డుతగులుతుంది.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమృతం -- వాషింగ్ పౌడరు

అమృతం

గీత ----- మానవప్రవర్తన