ఎన్నికల్లో --- ఎన్ని కలలో

ఎన్నికల్లో -- ఎన్ని కలలో రారా భోజనానికి చల్లారిపోతుంది. అమ్మమ్మ కేక విని భోజనానికి లేచాడు అమృతం. ఇదేమిటి! ఇంటినిండా గ్లాసులు ఉన్నాయి కదా!కొత్తవి ఎందుకు కొన్నావు? ప్రశ్నించాడు అమృతం. నీ మొహం ఇవి కొన్నవి కాదు. మన వార్డు మొంబరుగా పోటీ చేస్తున్న కాశీపతిగారి గుర్తు గ్లాసుట. అందుకని ఇంటికో అరడజను గ్లాసులు పంచేరు. అదీ సంగతి. ఓహో! అనుకుంటూ కంచంలో చేయి పెట్టాడు. అదేమిటే!వంకాయలు తెచ్చి నాలుగు రోజులయింది. అదీ రేటు ఎక్కువగా ఉందని ఒక కేజీయే తెచ్చాను.నాలుగు రోజులుగా వదలకుండా అదే కూర ఎలా వండు తున్నావు? మీ తాతగారి దగ్గర చదువుకున్న అప్పలనాయుడు కూడా పోటీ చేస్తున్నాడు. అతడి గుర్తు వంకాయిట. ఇంటికి రెండు కేజీలు చొప్పున పంచేరు.qqqqQ3q3aqq వంకాయికి వరన్నానికి వి11సుపులేదని అదే వండుతున్నాను. అయిష్టంగా భోజనం ముగించి నిద్రకుపక్రమించాడు అమృతం. "అమృతరావు జిందాబాద్" "అమృతం జిందాబాద్" మీ అమూల్యమైన ఓటును సెల్ ఫోను గుర్తుపై వేసి మన ప్రియతమ నాయకుడు అమృతరావునే గెలిపించ ప్రార్థన. సోదర సోదరీ మణులారా!⁰          జనా0న్ని తప్పించుకుని మెల్లిగా స్టేజ్ ఎక్కాడు అమృతం. మీరందరూ నాకే ఓటు వెయ్యాలి అని అడిగే ముందు ఎందుకు వెయ్యాలో చెబుతా వినండి.మేము అధికారంలోకి వస్తే మా పార్టీ అమలు చేసే పథకాలు వివరిస్తాను. "కోటా కొట్టు" పథకంలో మనిషికి పది కేజీల బియ్యం అదీ ఒక్క రూపాయికే ఇస్తాం. ప్రతీ నెలా ఏదో పండగ వస్తుంది. కాబట్టి నెల నెలా కానుక ఇస్తాం. "కానుక" పథకంలో ఒక కేజీ కందిపప్పు, రెండు కేజీల పంచదార,ఒక కేజీ చింతపండు,మూడు కేజీల నూనె, రెండు కేజీల మినపప్పు, ఐదు కేజీల నూక, కేజీ ఉప్పు ఉచితంగా కానుకగా ఇస్తాం. "దో బూచి" పథకంలో పుట్టిన దగ్గర నుండి ఆరు సంవత్సరాలు వయస్సు వరకు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాం. "నాన్నా - బడి" పథకంలో ఆరు సంవత్సరాల వయసు నుండి ఇరవై రెండేళ వయస్సు వరకు సంవత్సరానికి పదహారు వేలు ఇస్తాం. "ఉద్యోగం లేదు" పథకంలో ఇరవై మూడు వయస్సు మొదలుకొని నలభై ఐదు వయస్సు వరకు నిరుద్యోగ భృతి నెలకు రెండు వేలు ఇస్తాం. . "ముసలోడు" పధకం నలభై ఆరు సంవత్సరాల వయసు వారినుండి మూడు వేలతో అమలు చేస్తాం. "ఉరి - వద్దన్నా". రైతుల పాలిట కల్పతరువు. ఈ పధకంలో సన్నకారు రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తుంది. "బువ్వ" పథకంలో ఒక రూపాయికి పొద్దున్న టిఫిను టీ, మధ్యాహ్నం భోజనం నాలుగు రూపాయలు, సాయంత్రం స్నేక్స్ టీ ఒక రూపాయి, రాత్రి భోజనం నాలుగు రూపాయలకే అందిస్తాం. వినూత్న పథకం "బోడిగుండు" దీంట్లో భర్త పోయిన భార్యకు, భార్య పోయిన భర్తకు నెలకు మూడు వేలు అందుతాయి. "ఒంటరి - తుంటరి" తో ఒంటరిగా ఉండిపోయిన ఆడవారికి, మగవాడికి నెలకు మూడు వేలతో ఊరటనిస్తాం. "తోపుడుబండి" పధకం చిన్న వ్యాపారులకు బంగరుతరువు. వారికి సగం రాయితో రెండు లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తాం. పెద్దవారికెలాగూ "ఎగ్గొట్టు" పధకం ఉండనే ఉంది అది రద్దు చేయం. "గిజ్జన గూడు" ఇళ్లు లేని పేదవారికి స్వప్న సౌధం. పేదలందరికీ ఇళ్లు ఉండాలి అని మా నాయకుడి కోరిక.ఒకటి రెండు ఉన్న వారికి వచ్చినా బాధపడకండి. "పొగరాని పొయ్య" అక్క చెల్లెల్లకు వరం. నెలకు ఒక గ్యాసు బండ ఉచితం. "ఒళ్లు దాచుకో" పేదల పాలిటి పెన్నిధి. ప్రతీ పేదవారికీ సంవత్సరానికి మూడు జతల బట్టలు ఇస్తారు "చింపిరి జుట్టు" పేద వాడి మనస్సుకి అద్దం పట్టినట్టుండే పధకం.రెండు కేజీల కొబ్బరినూనె రెండు దువ్వెన్నలు ప్రతీ మనిషికి సంవత్సరానికి ఒక సారి ఇస్తారు. ఇప్పటి వరకూ ఏ దేశం లోనూ లేని పథకం "కాళ్లు కాలతాయి". దీంట్లో ప్రతీ ఒక్క పేదవాడు సంవత్సరానికి రెండు జతల చెప్పులు పొందుతాడు. చివరగా మీ అందరికీ మరొక్క పథకం మనవి చేసుకుంటున్న. అలసి సొలసి కష్ట పడే వారిని సేదతీరుస్తుంది అనడంతో సందేహం లేదు. అదే " బతుకు - ఉతుకు" ప్రతి కుటుంబానికి ఒక కలరు టీవీ , ఒక వాషింగు మిషను ఉచితంగా అందచేస్తాం. మీకు ఇవన్నీ కావాలి ! మాకు అధికారం కావాలి! మనది జన్మభూమే కాదు కర్మ (ఖర్మ) భూమి కూడా! జై భారత్ జనం చప్పట్లు కేకలు అమృతం ఇల్లు చేరుకున్నాడు.హాలంతా కార్యకర్తల తో కిటకిట లాడుతోంది. రేపటి కార్యాచరణ ఏమిటో మంతనాలు జరుపుతున్నారు. అన్నా!మన నియోజకవర్గం లో లక్ష ఓట్లు ఉన్నాయి. మన గుర్తు సెల్ ఫోను కదా, ఓటుకో ఫోను ఇస్తే మనం గెలవడం ఖాయం. ఎతవుద్ది. వంద కోట్లు అవుతుంది, గెలుపు .మనదే.ఏమంటారు ఆఁ!ఆఁ! అంత డబ్బే! అంత డబ్బే! నా దగ్గర లేదు. నా దగ్గర లేదు. ఒరేయ్! ఏమిట్రా ఆ కలవరింతలు. చాలా టైము అయింది లే. రాత్రి వచ్చేటప్పుడు దారిలో ఏదో తొక్కినట్టున్నాడు. అమ్మమ్మ లేపడంతో బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ లేచాడు అమృతం. ముఖం కనుక్కొని అమ్మమ్మ ఇచ్చే కాఫీ కోసం ఎదురుచూస్తూ పేపరు తిరగేస్తున్నాడు అమృతం. వీధిలో ప్రచారానికి మైకులు కట్టుకున్న ఆటోలు హోరెత్తిస్తున్నాయి. ఇదిగోరా కాఫీ అంటూ చప్పుడైన వీధి గుమ్మం వైపు వెళ్లింది అమ్మమ్మ. ఐదు సంవత్సరాల కొక సారి వీళ్లకి పండగే పండగ అంటూ వాళ్లు ఇచ్చిన కాగితం చూస్తూ అంది. వీడు మీ తాతగారి దగ్గర చదువుకున్న అప్పలనాయుడు. చదువు సరిగ్గా రాక రాజకీయాల్లోకి వెళ్లాడు అంటూ వంటింట్లోకి దారి తీసింది. అమ్మమ్మా! నేను ఆఫీసుకి వెడుతున్నాను. తలుపువేసుకో. ఈ రోజు ఎలక్షన్ ట్రైనింగ్ క్లాస్ ఉంది రావడం లేటు అవుతుంది అంటూ ఆదరా బాదరాగా ఆఫీసుకు బయలుదఏరాడు అమృతం. కరోనా వస్తోంది. న-కరో అంటున్నా మామూలుగానే మసులుతున్నారు జనం అనుకుంటూ భోజనం చేసి టీవీలో సీరియల్ చూస్తూ నడుం వాల్చింది అమ్మమ్మ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమృతం -- వాషింగ్ పౌడరు

అమృతం

గీత ----- మానవప్రవర్తన