పోస్ట్‌లు

నవంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

గీత ----- మానవప్రవర్తన

 ఇంద్రియాలను స్వాధీవములో ఉంచుకున్న వారికి జీవితం ఆనందమయమై సాగుతుంది. ఇంద్రియ లోలులైన వారికి అశాంతి, దుఃఖము కలుగుతుంది. ఆత్మ కర్మలకు సాక్షీభూతమే  నని మెలగువారు ఆనందముగ ఉండగలుగుతారు.  జన్మాంతర సంస్కారాన్ని అనుసరించి జీవులు వాని వాని కర్మలు చేస్తూ వాటియొక్క ఫలితాలను అనుభవిస్తున్నాయి. ఏ విత్తు నాటితే అదే మొక్క వస్తుంది. అలాగే మనం ఏది వండుకుంటామో అదే తింటాము. కనుక ఉన్నతిని పొందు అవకాశమున్న ఈ జన్మని ఆత్మోద్ధరణ నిమిత్తం సద్వినియోగం చేయడం మన కర్తవ్యం. ఎన్నో జన్మల తర్వాత సంప్రాప్తించిన ఈ మానవ జన్మను పరమాత్మను తెలుసుకుని ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయుటకు ప్రయత్నంచేసి సఫలీకృతులు కావాలి. ప్రతి జీవి సచ్చితానందస్వరూపమగు ఆత్మయేగాని దృశ్య రూపమగు దేహము కాదు అను సత్యాన్ని గ్రహించిన జ్ఞాని మోక్షమును పొందగల్గుచున్నాడు.                 కట్టినారు కొందరు కొట్టినారు                పట్టినారు కొందరు పెట్టినారు                 అందరిని సమముగ చూసినావు                 నీ అడుగుల కడ పడి ఉందు చిన్నికృష్ణా! అని పరమాత్మ చెంత బుద్ధి నిలిపి ఉంచవలెను.

గీత ---- ప్రవర్తన

 ఆత్మ యనునది  దేహము, ఇంద్రియములు, మనస్సులకు అతీతమైనది. అది మనము చేయు కర్మలకు సాక్షగవుండి చిత్త ప్రవృత్తులను వీక్షిస్తుంటుంది. కాని ఏ కర్మకూ అది కర్త కాదు. అజ్ఞానము చేత జీవుడు తన స్వస్వరూపమును మరచి సర్వమూ తానేనని భ్రమసి కర్మ వికారాలను తనపై వేసుకుని దుఃఖమును పొందుతున్నాడు. తత్వజ్ఞానముచేత జ్ఞానము పొందిన వారు ఆత్మ యందు స్థిరబుద్ధితో మెలగి ఇంద్రియములు చేయు కర్మలకు కర్తగాక సాక్షిగ మాత్రమే మెలుగుతారు. ఇంద్రియములు వాని వానియందు చేయు కర్మలకు నేను సాక్షిని మాత్రమేనని పరమార్ధతత్వము తెలిసినవాడు తలుస్తాడు.          కలడు కలడనెడి వారిలో కలవు నీవు          లేడు లేడనెడి వారిలో నిజమునీవు          ఉండి లేనట్లు ఉంటివి ఉర్వినాధా           నీ అడుగుల పడి ఉందు చిన్నికృష్ణా  అని బుద్ధిని పరమాత్మయందు లగ్నముచేసి జీవుని మోక్షమార్గము నందు  నడిపించవలెను. ఎవరు తాము చేయు కర్మలను పరమాత్మకర్పించి,  ఆసక్తి  విడిచి చేస్తారో వారు తామరాకుపై నీటిబొట్టువలె పాపమును అంటబడక మోక్షమును పొందుదురు.  నిష్కామ కర్మాచరణవల్ల చిత్తశుద్ధి కలుగును. దీనివల్ల మనస్సు పరమ నిర్మలత్వాన్ని పొందుతుంది.  దీనివల్ల జ్ఞానము పొంది జీవన్ముక్తుడు అవుతాడు

గీత ------ మానవప్రవర్తన

 జ్ఞానయోగము, కర్మయోగము దేనిని అనుష్ఠించినా ఒకే ఫలితం కలుగుతుంది అని తెలుసుకున్నవారు పరమార్ధము తెలుసుకున్న జ్ఞానులగుచున్నారు. యదార్ధాన్ని చూడగల్గడమే జ్ఞనము యొక్క చిహ్నము. అందువలన అవివేకమనే గుడ్డితనాన్ని వదలి దూరదృష్టి, విశాలభావము కలిగి, ఏ యోగమైనను మోక్షదాయకమనే గ్రహించగలగాలి.            All roads lead Rome. అలాగే పరమాత్మని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాన్ని ఎన్నుకున్నా, నిష్ఠతో, ఏకాగ్రతతో,  నిష్కల్మష చిత్తముతో అనుష్టించాలి. కర్మయోగ జ్ఞానము లేనిదే కర్మసన్యాసయోగ సిద్ధి కలుగదు.  కర్మయోగము నందు ఆరితేరినవారే జ్ఞానయోగమును మిక్కిలి సులభముగ పొందుతున్నారు.  కర్మలను నిష్కామముగ ఆదరించుట ప్రాధమిక విద్య  (elementary course), జ్ఞానయోగము  కళాశాల విద్య (college course) వంటివి.  కర్మలను చేయుచున్నను కర్మబంధముచే కట్టుబడక ఉండాలి. అట్టి వారియందు ఈ ఐదు లక్షణాలు ఉండాలి. అవి  1) నిష్కామముగ కర్మలను ఆచరించుట  2) నిర్మల హృదయము కలిగియుండుట 3) మనస్సు  యందు నిగ్రహము కలిగియుండుట  4) ఇంద్రియములను  జయించుట  5) తనయందున్న ఆత్మయే సర్వప్రాణికోటియందు ఉన్నదను           భావము కలిగియుండుట (ఏకాత్మ దర్శనము) ఈ లక్షణముల

గీత --- మానవప్రవర్తన

 రాగాలను వదలడం   సన్యాసం. ద్వేషాలను వదలటం   సన్యాసం.  వాసనా  త్యాగము       సన్యాసం. ఇది లేనివాడు సన్యాసి వేషధారియైన పతితుడు.  ఇది ఉన్నవాడు గృహస్తుడైననూ సన్యాసియే.          *******గీత రహస్యార్ధము******** కురుక్షేత్రము    ------- హృదయక్షేత్రము అర్జున రథము ------- శరీరము  సారధి కృష్ణుడు ------- ప్రజ్ఞానరూపమగు బుద్ధి ( పరమాత్మ) రధికుడైన   అర్జునడు ----- చంచల మనస్సు (జీవుడు) గుర్రములు  ------ ఇంద్రియములు కౌరవసేన------కామక్రోధ, రాగద్వేష, అహంకార, మమకారాది                           దుర్గుణములు. పాండవసేన ----- నిర్భయత్వం, భక్తి, శ్రద్ధ మొదలగు                            సద్గుణములు. అర్జున ధనస్సు ---- సాధన చతుష్టయము. సౌమ్యుడు --------- వివేకము. ధృతరాష్టుడు -------- అవిద్య, అవివేకము. దుర్యోధనుడు    ----- కామము.  భగవద్గీత------- జీవునిగూర్చి బుద్ధి పలుకు హితవాక్యములు. ఇక్కడ వివేకులు అంటే పారమార్థిక అనుభవ జ్ఞానమున్న మహనీయులు అనేగాని ప్రాపంచిక జ్ఞానమున్న చదువులు చదివేరా, పట్టాలున్నాయా? అనికాదు.  కర్మయోగాలలో ఏ ఒక్కదానినైననూ అనుష్ఠించవచ్చు. అత్యంత శ్రద్ధతో, నిష్టతో, ధృడసంకల్పముతో జీవించాలి. అప్పుడే మోక

గీత----మానవప్రవర్తన

 హిందూధర్మ సాహిత్యము ఎన్నో శాస్త్రములు, ఎన్నో గ్రంధాలు, ఎన్నో సిద్ధాంతాలు కలిగి ఉండి దేనిని ఆచరించాలో దేనిని త్యజించాలో తెలియక తికమక పడుతున్నారు. లోకంలో చాలా రకాల వేదాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి సరికావు విలువ లేనివి. మనకి అనుష్ఠాన వేదాంతం కావాలి. అర్ధం చేసుకున్న దానిని ఆచరణలో పెట్టగలగాలి.  మానవుడు నిత్యజీవితంలో నిరంతర గమనంలో, ఈ ఆధునిక యుగంలో బ్రతుకు పోరాటానికి శ్రమించటంలోనే సమయమంతా గడచి పోతోంది. పోరాటం, ఆరాటం, అలసట, ఆయాసాల మధ్య మనిషి కోల్పోతున్నది అతి విలువైన మనశ్శాంతి.  ఇలాంటి తరుణంలో ఓ ఆప్తుడిలా, శ్రేయోభిలాషిలా మనస్సుకి శాంతి చేకూర్చగలిగేది గీత ఒక్కటే. గీతాపఠనం సర్వ శుభదాయకం శాంతిప్రదం, తదుపరి మోక్షదాయకం.  Truths beautifully arranged together in their proper places like a fine garlend of choicest flowers. ------- Swamy Vivekananda                          కర్మ సన్యాసయోగము సన్యాసము అంటే త్యాగము. భగవానుడు 'కర్మయోగము'లో కర్మత్యాగము కూడదని నియమిత కర్మలను నిష్కామముగ దైవమునకు అర్పణ చేస్తూ చేయ్యాలి అని ప్రభోదించాడు.  ఇక్కడ  చూస్తే కర్మల త్యాగం గూర్పి ప్రస్తావన వచ్చింది. అందువ

గీత---మానవప్రవర్తన

 త్యాగము--సన్యాసము:--- త్యాగము అంటే అన్నీ వదిలివేయడమని, సన్యాసం అంటే ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, బంధువులు మరియు ఆస్తిపాస్తులు వదిలేసి కాషాయం ధరించి ఉండాలి అనుకుని, అలా ఉండటం కష్టం అని భావించేవారు. కనుక అరుదుగా ఉండేవారు. కర్మలను చేస్తూ కర్మఫలాన్ని ఈశ్వరార్పణగ వదలడమే త్యాగము అని చెప్పారు.   సన్యాసం అంటే ఏవీ వదిలిపెట్టఖరలేదు. ఏ పనిచేస్తున్నవారు ఆ పని  చేసుకోవచ్చు. క్రియలయందు కర్తృత్వ బుద్ధిని, కామ్యబుద్ధిని వదిలితేచాలు.  అదే సన్యాసం అంటే యోగము:--- యోగము అంటే హఠయోగమో లేక అష్టాంగమోగమో చాలా కఠినమైనవి అని యోగాభ్యాసానికి దూరంగా ఉండేవారు. కార్యము ఫలించిననా ఫలించకపోయినా చిత్తమునందు సమష్థితిని కలిగి ఉండటం యోగము అని గీతాచార్యులు పేర్కొన్నారు. కర్మలందలి ఫలాపేక్షను వదిలివేసి, జీవుని పరమాత్మయందు ఐక్యము చేయడానికి పడే ప్రతి తపన యోగమే అన్నారు. తపస్సు:--- తపస్సు అంటే తల్లక్రిందులుగా అనో, ఆహార పానీయాలు వదిలి, మండుటెండలో  వానలో తట్టుకుని చెయ్యాలి  చాలా భయంకరం,బాధాకరం అనుకుని దాని జోలికి పోయేవారుకాదు. కృష్ణుని ఆదేశానుసారం మోక్షమునకు తపస్సుఆవశ్యకము.అయితే అది సర్వజన ఆచరణ యోగ్యమైనదే. అది శారీరక, వాచిక, మానస

గీత---మానవ ప్రవర్తన

 ఇదివరలో శాస్త్రకారులు  ప్రవచించిన భావాలకు పదాలకు గీతయందు నూతనరూపు  బోధించబడినది. దానిని మనకు సులభరీతిలో  ఆచరించ, అర్ధమగు విధంగా  శ్రీ రామకృష్ణగారు విశదీకరించారు.         యజ్ఞము, యోగము, త్యాగము, సన్యాసము మరియు తపస్సు  అనేవిషయాల గురించి సులభరీతిలో మనకు వివరించారు. యజ్ఞము:- అనగా  ధనధాన్య వ్యయం, ఋత్విక్కులతో పెద్ద తతంగం కష్టతరం అందరూ చేయలేరని భావించేవారు. ఎక్కువ శ్రమలేనిది, పండితులకు-పామరులకు, ధనికులకు-దరిద్రులకు, స్త్రీలకు-పురుషులకు, అన్ని వర్ణములవారికి ఆచరించదగినది ధనవ్యయం లేనిది సూచించారు. కర్తృత్వము లేకుండ చేయబడే ప్రతికార్యము ఒక మహాయజ్ఞమే అని వచించారు. దైవకార్యముగ,  దైవార్పణగ చేసి ప్రతి పనీ యజ్ఞక్రియగ మారుతుంది. దీనివల్ల మనుషులు తన దైనందిన కార్యక్రమములన్నింటినీ పవిత్ర యజ్ఞకర్మలుగ మార్చుకోవచ్చు. దీనివల్ల మోక్షం కలుగుతుంది. పూర్వం చెప్పిన క్రతువులన్నీ కామ్యకర్మలే. వాటివల్ల మోక్షప్రాప్తి కలగదు.