గీత --- మానవప్రవర్తన

 బంధమునకు గాని మోక్షమునకు గాని మనస్సే కారణము. మనస్సు చంచలముగ ఉంటే బంధము నిశ్చలముగ ఉంటే మోక్షము లభిస్తాయి. బ్రహ్మజ్ఞాని విపత్కర అప్రియ సందర్భాలలో దుఖించడు. అలాగే ఎటువంటి సౌఖ్యప్రదములయందు ఉప్పొంగడు. ఈ ప్రపంచం స్వప్న తుల్యముగ భావిస్తారు. 

వారు అన్ని జీవరాశులయందు సమ భావము కల్గి ఉంటారు. 

(In the state of equilibrium)

జ్ఞానికి అజ్ఞానికి గల బేధం వారి నడవడిలోనే తెలిసిపోతుంది.   నేత్రములు కలవారికి లేనివారికి నడకయందు ఎట్లు తేడా ఉండునో అట్లే జ్ఞానికి అజ్ఞానికి బేధము ఉంటుంది. 

ఆత్మ నిలకడగ ఉండవలెనన్న బాహ్య విషయములనుండి మనస్సును మరల్చాలి.  ఆత్మ జ్ఞానము గలవారు సుఖ - దుఖ్ఖ ములయందు సమభావము కలిగియుందురు. సమదృష్టి వైరాగ్యానికి చివరి మెట్టు. 

భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువుము మనసా అని అన్నమయ్య అన్నారు

 

కాలము నితనిరూపే కర్మము నితనిరూపే 

యేలి యాచార్యుడు చెప్పినదితనిరూపే

శ్రీలలనాపతి శ్రీవేంకటేశ్వరుడే

పాలించగాగంటి నే నీపరమాత్ముని రూపే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమృతం -- వాషింగ్ పౌడరు

అమృతం

గీత ----- మానవప్రవర్తన