పోస్ట్‌లు

ఆగస్టు, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

అమృతం -- వాషింగ్ పౌడరు

ఒరేయ్ అమృతం మార్కెట్టుకి వెళ్ళి కూరగాయలు తేవాలి , ఇంట్లో నిండుకున్నాయి.  బెండకాయలు  ఈ పూట చేశాను. రేపటికి తేవాలి.   అమ్మమ్మా! నాకు కుదరదు. రేపట్నుంచి నాకు ఆఫీసులో ఆడిట్ ఉంది. చిన్నాడిని తీసుకుని వెళ్లి నువ్వే తెచ్చుకో అని తన పనిలో తను ములిగి పోయాడు. చంటీ! పదరా మనం మార్కెట్టుకి వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం అని పిలిచి సంచి తీసుకుని బయలు దేరారు ఇద్దరూ.  కావలసిన సరుకులు కొనుక్కుని, కూరగాయల మార్కెట్టుకి వచ్చారు.  కూరగాయలు తీసుకుని అమ్మమ్మ డబ్బులు తీసి కొట్టువాడికి ఇచ్చింది.   డబ్బులు ఇచ్చేడప్పుడు పది రూపాయలు పడిపోవడం ఆమె గమనించలేదు కానీ చంటాడు గమనించి, బడ్డీ కిందకి దూరి కష్టపడి తీసి అమ్మమ్మకి ఇచ్చాడు. అరె చొక్కా అంతా మురికి అయిపోయింది. పోతే పోయింది వదిలేయకపోయావా? కసురుకుంది అమ్మమ్మ. ఫరవాలేదమ్మా  పది రూపాయల ఈ వాషింగు పౌడరుతో  ఉతికితే మరకలన్నీ పోతాయమ్మా అంటూ వాషింగు పౌడరు పేకెట్టు తీసి ఇచ్చాడు.   ఓరి నీ మొహంమ్మండ! పది రూపాయలతో పౌడరు కొని అది వేసి ఉతకడం వల్ల మరకలు పోతాయి కరక్టే. పది రూపాయలతో పాటు ఉతికే శ్రమ ఎవరికిస్తావు?  అదే పదిరూపాయలు తీయకుండా ఉంటే,  ఉతికే శ్రమ ఉండేది కాదు కదా .  ఇప్పుడు పది

అమృతం

ఒరేయ్ అమృతం ఏం చేస్తున్నావు? భోజనం టైము దాటిపోతోంది. కాళ్ళు చేతులు కడుక్కుని రా! ఆఁ వస్తున్నా. ఐదు నిమిషాల్లో వస్తున్నా. అమ్మమ్మా! ఏం చేశావు ఈరోజు? అంటూ చేతులు ముఖం తువ్వాలుతో తుడుచుకుంటూ వచ్చాడు అమృతం. పప్పూమామిడికాయ, వంకాయ కూర,ముక్కల పులుసు ఉన్నాయిరా అంటూ కంచం తుడిచి పెట్టింది అమ్మమ్మ. భోంచేసి చిన్నగా కునికాడు అమృతం. చిన్న మనవడు స్కూలు నుంచివచ్చేసరికి ఏదో ఒకటి తినడానికి ఉండాలి లేకపోతే చిరాకు పడతాడు అనుకుంటూ వంటింటి దారి పట్టింది అమ్మమ్మ. ఆఁ నూడిల్సు అంటే ఇష్టం వెధవకి అనుకుంటూ, నూడిల్సు తయారు చేసింది. వాడు వచ్చేసరికి నూడిల్సు, సాసు టేబులు మీద పెట్టింది. అమ్మమ్మా! నేను ఫ్రష్ అయి వచ్చేశా, ఏం చేశావు అని అంటూ డైనింగు టేబులు దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. అమృతం కూడా టీ టైము అయిందని తనూ కుర్చీలో కూర్చన్నాడు. అమ్మమ్మ ఇచ్చిన టీ తాగుతూ చంటాడి ప్లేటుకేసి చూశాడు. వాడు నూడిల్సు ప్లేటులో సాసు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాని అది పడటం లేదు. అమ్మమ్మా సాసు పడటం లేదు అని అరిచాడు చంటాడు. ఉండు వస్తున్నా అని ఒక డల్కోఫ్లెక్సు టాబ్లెట్ తెచ్చింది. అది ఎందుకు? ప్రశ్నించాడు అమృతం ఓరి వెర్రిమొహం ఎప్ప