అమృతం

ఒరేయ్ అమృతం ఏం చేస్తున్నావు? భోజనం టైము దాటిపోతోంది. కాళ్ళు చేతులు కడుక్కుని రా! ఆఁ వస్తున్నా. ఐదు నిమిషాల్లో వస్తున్నా. అమ్మమ్మా! ఏం చేశావు ఈరోజు? అంటూ చేతులు ముఖం తువ్వాలుతో తుడుచుకుంటూ వచ్చాడు అమృతం. పప్పూమామిడికాయ, వంకాయ కూర,ముక్కల పులుసు ఉన్నాయిరా అంటూ కంచం తుడిచి పెట్టింది అమ్మమ్మ. భోంచేసి చిన్నగా కునికాడు అమృతం. చిన్న మనవడు స్కూలు నుంచివచ్చేసరికి ఏదో ఒకటి తినడానికి ఉండాలి లేకపోతే చిరాకు పడతాడు అనుకుంటూ వంటింటి దారి పట్టింది అమ్మమ్మ. ఆఁ నూడిల్సు అంటే ఇష్టం వెధవకి అనుకుంటూ, నూడిల్సు తయారు చేసింది. వాడు వచ్చేసరికి నూడిల్సు, సాసు టేబులు మీద పెట్టింది. అమ్మమ్మా! నేను ఫ్రష్ అయి వచ్చేశా, ఏం చేశావు అని అంటూ డైనింగు టేబులు దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. అమృతం కూడా టీ టైము అయిందని తనూ కుర్చీలో కూర్చన్నాడు. అమ్మమ్మ ఇచ్చిన టీ తాగుతూ చంటాడి ప్లేటుకేసి చూశాడు. వాడు నూడిల్సు ప్లేటులో సాసు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాని అది పడటం లేదు. అమ్మమ్మా సాసు పడటం లేదు అని అరిచాడు చంటాడు. ఉండు వస్తున్నా అని ఒక డల్కోఫ్లెక్సు టాబ్లెట్ తెచ్చింది. అది ఎందుకు? ప్రశ్నించాడు అమృతం ఓరి వెర్రిమొహం ఎప్పుడూ టీవీలో చూడలేదా? ఈ బిళ్ళ అందులో వేసి గిలకరించి వేసుకుంటే పడుతుందిరా. అప్పుడప్పుడైనా టీవీ చూస్తోండు. లోకజ్ఞానం పెరుగుతుంది అని ఫ్రీగా ఒక సలహా పడేసింది. అమ్మమ్మా! అది ఇందుకు కాదు.అది వేరేదానికి అని లాక్కుని పక్కన పడేశాడు అమృతం. ఇది ఎప్పడిదో డేటు అయిపోయుంటుంది అని అల్మారా లోంచి మరో సీసా తీసినవాడు. ఛీ వెధవ టీవీలు, పాడు ఎడ్వర్టైజుమెంట్లు. అదీ భోజనం టైములో వేస్తారు అనుకుంటూ బయటకు నడిచాడు అమృతం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమృతం -- వాషింగ్ పౌడరు

గీత ----- మానవప్రవర్తన