గీత ---- ప్రవర్తన

 ఆత్మ యనునది  దేహము, ఇంద్రియములు, మనస్సులకు అతీతమైనది. అది మనము చేయు కర్మలకు సాక్షగవుండి చిత్త ప్రవృత్తులను వీక్షిస్తుంటుంది. కాని ఏ కర్మకూ అది కర్త కాదు. అజ్ఞానము చేత జీవుడు తన స్వస్వరూపమును మరచి సర్వమూ తానేనని భ్రమసి కర్మ వికారాలను తనపై వేసుకుని దుఃఖమును పొందుతున్నాడు.

తత్వజ్ఞానముచేత జ్ఞానము పొందిన వారు ఆత్మ యందు స్థిరబుద్ధితో మెలగి ఇంద్రియములు చేయు కర్మలకు కర్తగాక సాక్షిగ మాత్రమే మెలుగుతారు. ఇంద్రియములు వాని వానియందు చేయు కర్మలకు నేను సాక్షిని మాత్రమేనని పరమార్ధతత్వము తెలిసినవాడు తలుస్తాడు.

         కలడు కలడనెడి వారిలో కలవు నీవు

         లేడు లేడనెడి వారిలో నిజమునీవు

         ఉండి లేనట్లు ఉంటివి ఉర్వినాధా

          నీ అడుగుల పడి ఉందు చిన్నికృష్ణా 

అని బుద్ధిని పరమాత్మయందు లగ్నముచేసి జీవుని మోక్షమార్గము నందు  నడిపించవలెను.

ఎవరు తాము చేయు కర్మలను పరమాత్మకర్పించి,  ఆసక్తి  విడిచి చేస్తారో వారు తామరాకుపై నీటిబొట్టువలె పాపమును అంటబడక మోక్షమును పొందుదురు. 

నిష్కామ కర్మాచరణవల్ల చిత్తశుద్ధి కలుగును. దీనివల్ల మనస్సు పరమ నిర్మలత్వాన్ని పొందుతుంది.  దీనివల్ల జ్ఞానము పొంది జీవన్ముక్తుడు అవుతాడు. 

బంధమునకు కారణము ఆశ. ఆశారాహిత్యమే మోక్షమునకు కారణం. మలిన చిత్తమందు జ్ఞానము అంకురించదు.  నిష్కామ కర్మయోగి చిత్తశుద్ధి వలన ఆత్మనిష్టాపరమగు శాశ్వత శాంతిని పొందుచున్నాడు. 

అజ్ఞాని ఆశాప్రేరితుడై, కర్మఫలాలయందు ఆసక్తి కలిగి కట్టబడుచున్నాడు. సుఖశాంతులు కోరేవారు నిష్కామ కర్మయోగము ఆచరించుచు శ్రద్ధగ జీవించాలి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమృతం -- వాషింగ్ పౌడరు

అమృతం

గీత ----- మానవప్రవర్తన