అమృతం -- వాషింగ్ పౌడరు

ఒరేయ్ అమృతం మార్కెట్టుకి వెళ్ళి కూరగాయలు తేవాలి , ఇంట్లో నిండుకున్నాయి.  బెండకాయలు 
ఈ పూట చేశాను. రేపటికి తేవాలి.  
అమ్మమ్మా! నాకు కుదరదు. రేపట్నుంచి నాకు ఆఫీసులో ఆడిట్ ఉంది. చిన్నాడిని తీసుకుని వెళ్లి నువ్వే తెచ్చుకో అని తన పనిలో తను ములిగి పోయాడు.
చంటీ! పదరా మనం మార్కెట్టుకి వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం అని పిలిచి సంచి తీసుకుని బయలు దేరారు ఇద్దరూ. 
కావలసిన సరుకులు కొనుక్కుని, కూరగాయల మార్కెట్టుకి వచ్చారు. 
కూరగాయలు తీసుకుని అమ్మమ్మ డబ్బులు తీసి కొట్టువాడికి ఇచ్చింది.  
డబ్బులు ఇచ్చేడప్పుడు పది రూపాయలు పడిపోవడం ఆమె గమనించలేదు కానీ చంటాడు గమనించి, బడ్డీ కిందకి దూరి కష్టపడి తీసి అమ్మమ్మకి ఇచ్చాడు.
అరె చొక్కా అంతా మురికి అయిపోయింది. పోతే పోయింది వదిలేయకపోయావా? కసురుకుంది అమ్మమ్మ.
ఫరవాలేదమ్మా  పది రూపాయల ఈ వాషింగు పౌడరుతో  ఉతికితే మరకలన్నీ పోతాయమ్మా అంటూ వాషింగు పౌడరు పేకెట్టు తీసి ఇచ్చాడు.  
ఓరి నీ మొహంమ్మండ! పది రూపాయలతో పౌడరు కొని
అది వేసి ఉతకడం వల్ల మరకలు పోతాయి కరక్టే. పది రూపాయలతో పాటు ఉతికే శ్రమ ఎవరికిస్తావు? 
అదే పదిరూపాయలు తీయకుండా ఉంటే,  ఉతికే శ్రమ ఉండేది కాదు కదా . 
ఇప్పుడు పది రూపాయలతో బాటు శ్రమ కూడా ఖర్చవుతుంది. ఆ పది తీయక పోతే కనీసం శ్రమేనా మిగిలేది కదరా తింగరోడా. ఇటువంటి సలహాలు  ఇక ఎవరికీ ఇవ్వకు అంటూ చంటాడి చెయ్యి పట్టుకుని ఇంటికి నడిచింది అమ్మమ్మ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమృతం

గీత ----- మానవప్రవర్తన