కులం - మతం

కులమడుగ మంచితనమను మతమేమన
మానవత్వమును మించినదేదను 
కులమతమెందుకు మనకు కూడుబెట్టనివి
గంతులిడి విను ఓ గోరుగంతులా!

మానవత్వమాచరించ మనుజుడగును
కులమునందు కులుక కుత్సితుడగు 
మతమున మౌఢ్యమున్న మత్సరుడగు 
గంతులిడి విను ఓ గోరుగంతులా!

సనాతన ధర్మమన జీవనవిధానమే గాని
సనాతనము గుర్తింప మతము కానె కాదు 
మతము ధర్మములందు మర్మమెరిగి మసలు 
గంతులిడి విను ఓ గోరుగంతులా!





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎన్నికల్లో --- ఎన్ని కలలో