పోస్ట్‌లు

ఏప్రిల్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అమృతం -- వాషింగ్ పౌడరు

ఒరేయ్ అమృతం మార్కెట్టుకి వెళ్ళి కూరగాయలు తేవాలి , ఇంట్లో నిండుకున్నాయి.  బెండకాయలు  ఈ పూట చేశాను. రేపటికి తేవాలి.   అమ్మమ్మా! నాకు కుదరదు. రేపట్నుంచి నాకు ఆఫీసులో ఆడిట్ ఉంది. చిన్నాడిని తీసుకుని వెళ్లి నువ్వే తెచ్చుకో అని తన పనిలో తను ములిగి పోయాడు. చంటీ! పదరా మనం మార్కెట్టుకి వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం అని పిలిచి సంచి తీసుకుని బయలు దేరారు ఇద్దరూ.  కావలసిన సరుకులు కొనుక్కుని, కూరగాయల మార్కెట్టుకి వచ్చారు.  కూరగాయలు తీసుకుని అమ్మమ్మ డబ్బులు తీసి కొట్టువాడికి ఇచ్చింది.   డబ్బులు ఇచ్చేడప్పుడు పది రూపాయలు పడిపోవడం ఆమె గమనించలేదు కానీ చంటాడు గమనించి, బడ్డీ కిందకి దూరి కష్టపడి తీసి అమ్మమ్మకి ఇచ్చాడు. అరె చొక్కా అంతా మురికి అయిపోయింది. పోతే పోయింది వదిలేయకపోయావా? కసురుకుంది అమ్మమ్మ. ఫరవాలేదమ్మా  పది రూపాయల ఈ వాషింగు పౌడరుతో  ఉతికితే మరకలన్నీ పోతాయమ్మా అంటూ వాషింగు పౌడరు పేకెట్టు తీసి ఇచ్చాడు.   ఓరి నీ మొహంమ్మండ! పది రూపాయలతో పౌడరు కొని అది వేసి ఉతకడం వల్ల మరకలు పోతాయి కరక్టే. పది రూపాయలతో పాటు ఉతికే శ్రమ ఎవరికిస్తావు?  అదే పదిరూ...

ధర్మం -- మతం

సనాతనమన జీవనవిధానమె గాని సనాతనము గుర్తింప మతము గాదు  మతము ధర్మము లందు మర్మమెరిగి మసలు గంతులిడి విను గోరుగంతులా!

మానవుడు

మానవత్వము ఆచరించ మానవుడగు కులము నందు కులుక కుత్సితుడగు  మతమున మౌఢమున్న మత్సరుడగు  గంతులిడి విను ఓ గోరుగంతులా!