పోస్ట్‌లు

జనవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

కులం - మతం

కులమడుగ మంచితనమను మతమేమన మానవత్వమును మించినదేదను  కులమతమెందుకు మనకు కూడుబెట్టనివి గంతులిడి విను ఓ గోరుగంతులా! మానవత్వమాచరించ మనుజుడగును కులమునందు కులుక కుత్సితుడగు  మతమున మౌఢ్యమున్న మత్సరుడగు  గంతులిడి విను ఓ గోరుగంతులా! సనాతన ధర్మమన జీవనవిధానమే గాని సనాతనము గుర్తింప మతము కానె కాదు  మతము ధర్మములందు మర్మమెరిగి మసలు  గంతులిడి విను ఓ గోరుగంతులా!